పిల్లలను సక్రమ మార్గములో పెట్టడానికి గల సలహాలు సూచనలు -1

మా కాలనీ లో ఒక ఫంక్షన్ జరుగుతోంది
ఇక ముచ్చట్లు మొదలు అయ్యాయి
చూ డండి పిల్లలు ఎంత తెలివిమీరి పోయారో 
మా వాడు ఈ రోజు పొద్దునే లేవగానే ఈ రోజు బ్రేక్ ఫాస్ట్ ఏంటి అని  అడుగుతున్నాడు  అని సరోజ 
మా వాడు నిన్ననే  నేను ఏమి చేయాలో చెప్పి పడుకున్నాడు అని గిరిజ
మా వాడు మొన్న ప్రోగ్రెస్ కార్డు లో వాళ్ళ నాన్న సంతకం చేసాడు  అండీ అని వనజ
ఏమైనా చెప్పండి మా చిన్నది మరీ స్పీడ్ ఎక్కువ అండీ నా ఫోన్ లో ఇంటర్నెట్ ఎలా ఓపెన్ చేయాలో అదే చెబుతుంది నాకు అని సహజ
ఇలా జరుగుతున్నాయి ముచ్చట్లు
వాళ్ళ మాటలు విన్న గాయత్రి మీ పిల్లలు ఏమి చదువుతున్నారు? అని అడిగింది  అందరూ ఎల్ కె జి , యూ కె జి ,  అని చెప్పారు.
వాళ్ళకి చాలా తెలివి ఎక్కువే ,లేనిది మీకు
ఎలా చెప్పండి గాయత్రి గారు చస్తున్నాము వాళ్ళ అల్లరికి
రేపు మా ఇంటికి రండి మీ నలుగురు వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలో నేను చెబుతాను వినండి
పిల్లల్ని ఎలా పెంచాలి ?ఏమి ఆహారము ఇవ్వాలి ?ఎలాంటి కధలు చెప్పాలి వాళ్ళకి? చెబుతాను రోజూ మీకు ---ఒక గంట అట్లా నెలరోజులు చెబుతాను
తర్వాత మీ పిల్లలలో మార్పు మీకే తెలుస్తుంది అన్నది గాయత్రి 
మేము రేపటినుండి తప్పకుండా వస్తాము. ఎంతైనా మీరు చైల్డ్ సైకాలజీ చదివారు కదండీ
మా పిల్లలను మా కుటుంబం లో  అందరికంటే గొప్పగా తీర్చి దిద్దుతాము  అని అన్నారు సరోజ , గిరిజ, వనజ  మరియు సహజ.
Comments